అభిషేకం

అభిషేకం ఒక విధమైన హిందూ సాంప్రదాయం. ఈ పద్ధతిలో హిందూ దేవతామూర్తులను వివిధ పదార్ధాలు, వస్తువులతో అతని శరీర భాగాల్ని అభిషేకిస్తారు.

భాషా విశేషాలు

తెలుగు భాషలో అభిషేకము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] అభిషేకము నామవాచకంగా Installation by anointing, initiation, royal unction, bathing, anointing, inauguration. స్నానము, మునక, పట్టము కట్టడము అని అర్ధాలున్నాయి. ఉదా: దేవునికి అభిషేకము అయిన తరువాత after the idol was bathed. తైలాభిషేకము anointing with oil. చూర్ణాభిషేకము a particular rite of pouring turmeric powder over the head of an idol on the sixth day of the annual feast called బ్రహ్మోత్సవము. పట్టాభిషేకము coronation of a king. ఉదా: పట్టాభిషేకము చేయు to crown a king. రాజు ఆ కవికి స్వర్ణాభిషేకము చేసాడు the prince showered bounties upon the poet. అన్నాభిషేకము చేయు to pour boiled rice over an image. అభిషేకించు v. t. అనగా To bathe, anoint. తల అంటు, మునిగించు. అభిషిక్తము adj. Installed by anointing, bathed, anointed. పట్టము కట్టబడిన, స్నానము చేయింపబడిన. అభిషిక్తుడు. n. He who is inaugurated or installed, he who is bathed or anointed. పదప్రాప్తుడు, పట్టము కట్టబడినవాడు, స్నాతుడు. అభిషేచనము n. Sprinkling, inauguration.

రకాలు

  • రుద్రాభిషేకం: శివాలయాల్లో రుద్రుడు అనగా శివునికి ప్రతి రోజూ మొదటగా చేసే అభిషేక కార్యక్రమం.
  • ప్రేమాభిషేకం:
  • పాదాభిషేకం: కొందరు వ్యక్తులకు లేదా అతిథులకు ఆహ్వానించుటకు ముందుగా వారి పాదాలను మంచి నీటితో కడగడాన్ని పాదాభిషేకం అంటారు. కన్యాదానం అప్పుడు కూడా ఈ ఆచారం ఉంది.
  • పాలాభిషేకం లేదా క్షీరాభిషేకం: దేవునికి పాలతో చేసే అభిషేకం. ఇది షిర్డి సాయిబాబా ఆలయాలలో జరిగే విశేష కార్యక్రమం.
  • కుంబాభిషేకం: దేవునిని కుండలతో నీటిని అభిషేకించే కార్యక్రమం. వర్షాల కోసం చేసే పూజలలో ఈ కుంబాభిషేకం ముఖ్యమైనది.

సామాగ్రి

  1. పాలు
  2. పెరుగు
  3. నేయి
  4. పూలు
  5. 5 రకాల పండ్లు
  6. పసుపు
  7. కుంకుమ
  8. కర్జూరపు కాయలు
  9. తేనె
  10. గంధము
  11. పూలు
  12. పూల మాల
  13. ద్రాక్ష
  14. ముంతమామిడి పప్పు
  15. కలకండ
  16. కడ్డీలు

ఇవి కూడా చూడండి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.