అభిమన్యుడు

అభిమన్యుడు పాండురాజు కుమారుడు మరియు పాండవ మధ్యముడు అయిన అర్జునునికి, బలరామకృష్ణుల సహోదరి అయిన సుభద్రకు జన్మించిన పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.

అభిమన్యుని యుద్ధానికి పంపుతున్న ఉత్తర.


అభిమన్యుడు పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. వివాహానంతరము అభిమన్యుడు, అర్జునుడు యుద్ధభూమిలో లేని సమయంలో ద్రోణుడుచే రచించబడిన పద్మవ్యూహములో ప్రవేశించి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోదన, దుశ్శాసన, కర్ణాదులచే సంహరింపబడి వీరమరణము పొందటంతో అభిమన్యుని కథ భారతములో దాదాపు ముగుస్తుంది. అభిమన్యుని మరణము అర్జునునికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది. సుభద్ర పుత్రశోకంతో అభిమన్యుని మరణాన్ని నివారించలేదని కృష్ణుని నిలదీస్తుంది. అభిమన్యుని మరణసమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉండటము వలన ఆమె సహగమనము నివారించబడినది. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్దామ సంహరించడము వలన అభిమన్యుని పుత్రుని వలననే పాండవ వంశము వృద్ధి చెందినది. దుర్యోధనుని సోదరి భర్త సైంధవుడు, అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించిన తరువాత అర్జునుని మినహా మిగిలిన పాండవులను అడ్డగించాడని, ఆ కారణంగానే అభిమన్యుడు యుద్ధములో మరణించాడని క్రోధుడైన అర్జునుడు ప్రతినచేసి సైంధవుని సంహరించి తన పుత్రశోకాన్ని ఒకింత తగ్గించుకుంటాడు. అందువలన సైంధవుని మరణానికి అభిమన్యుడు కారణమౌతాడు. అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహములో ఎలాప్రవేశించాలని వివరించినపుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు వినడం గ్రహించిన కృష్ణుడు అర్జునుని నివారించి పద్మవ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా చేశాడు. ఆకారణంగా పద్మవ్యూహంలో ప్రవేశించిన అభిమన్యుడు పద్మవ్యూహంనుండి బయట పడలేక వీరమరణం చెందినట్లు మహాభారత కథనం వివరిస్తుంది.

మహాభారతం - ఆంధ్ర మహాభారతం - వ్యాసుడు - కవిత్రయం

పర్వాలు

ఆది పర్వము  సభా పర్వము  వన పర్వము లేక అరణ్య పర్వము  విరాట పర్వము  ఉద్యోగ పర్వము  భీష్మ పర్వము  ద్రోణ పర్వము  కర్ణ పర్వము  శల్య పర్వము  సౌప్తిక పర్వము  స్త్రీ పర్వము  శాంతి పర్వము  అనుశాసనిక పర్వము  అశ్వమేధ పర్వము  ఆశ్రమవాస పర్వము  మౌసల పర్వము  మహాప్రస్ధానిక పర్వము  స్వర్గారోహణ పర్వము  హరివంశ పర్వము

పాత్రలు
శంతనుడు | గంగ | భీష్ముడు | సత్యవతి | చిత్రాంగదుడు | విచిత్రవీర్యుడు | అంబ | అంబాలిక | విదురుడు | ధృతరాష్ట్రుడు | గాంధారి | శకుని | సుభద్ర | పాండు రాజు | కుంతి | మాద్రి | యుధిష్ఠిరుడు | భీముడు | అర్జునుడు | నకులుడు | సహదేవుడు | దుర్యోధనుడు | దుశ్శాసనుడు | యుయుత్సుడు | దుస్సల | ద్రౌపది | హిడింబి | ఘటోత్కచుడు | ఉత్తర | ఉలూపి | బభృవాహనుడు |అభిమన్యుడు | పరీక్షిత్తు | విరాటుడు | కీచకుడు | ద్రోణుడు | అశ్వత్థామ | ఏకలవ్యుడు | కృతవర్మ | జరాసంధుడు | సాత్యకి | దుర్వాసుడు | సంజయుడు | జనమేజయుడు | వేదవ్యాసుడు | కర్ణుడు | జయద్రధుడు | శ్రీకృష్ణుడు | బలరాముడు | ద్రుపదుడు | | దృష్టద్యుమ్నుడు | శల్యుడు | శిఖండి
ఇతర విషయాలు
పాండవులు | కౌరవులు | హస్తినాపురం | ఇంద్రప్రస్థం | రాజ్యాలు | కురుక్షేత్ర యుద్ధం | భగవద్గీత


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.