అనిల్ కపూర్
అనిల్ కపూర్ (జ: 1956 డిసెంబరు 24[1]) ఒక భారతీయ నటుడు మరియు నిర్మాత. అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించాడు. వంశవృక్షం అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన స్లమ్ డాగ్ మిలియనీర్లో మొదటి సారిగా నటించాడు.
| Anil Kapoor | |
|---|---|
Anil Kapoor at the San Diego Comic Con on 24 July 2009 in San Diego, California | |
| జననం | 1956 డిసెంబరు 24 [1] Chembur Mumbai, Maharashtra, India |
| వృత్తి | Actor, Producer |
| క్రియాశీలక సంవత్సరాలు | 1984 – Present |
| జీవిత భాగస్వామి | Sunita Kapoor (1984 – Present) |
| పిల్లలు | Sonam Kapoor Rhea Kapoor Harshvardhan Kapoor |
| తల్లిదండ్రులు | Surinder Kapoor (Father) Nirmal (Mother) |
| బంధువులు | Boney Kapoor (Brother) Sanjay Kapoor (Brother) Arjun Kapoor (Nephew) Sridevi (sister-in-law) |
బాల్యం, విద్యాభ్యాసం
అనిల్ కపూర్ 1956 డిసెంబరు 24 న చెంబూరు, ముంబైలో జన్మించాడు. ఆయన తండ్రి సినీ నిర్మాత సురీందర్ కపూర్. పాఠశాల విద్య చెంబూరు లోని'అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ సక్కర్ ఉన్నత పాఠశాల' లోనూ, ఉన్నత విద్య సెయింట్ జేవియర్స్ కళాశాలలోనూ చదివాడు.[2]
కుటుంబం
1984 లో ఆయన సునీతా కపూర్ (పూర్వనామం:భంభాని) ను వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (హర్షవర్ధన్). పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ కథానాయిక. చిన్న కూతురు రియా కపూర్ న్యూయార్క్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని నిర్మాతగా మారింది.ఆయన అన్న బోనీ కపూర్ కూడా సినీ నిర్మాత.
మూలాలు
- IANS (22 December 2012). "My dad is a liar: Sonam Kapoor". Hindustan Times. Retrieved 2012-03-22.
- He lived in Tilak Nagar colony in Chembur. Anil Kapoor – Biography
ఇతర లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనిల్ కపూర్ పేజీ