అనంతకుమార్

అనంత కుమార్ (కన్నడం: ಅನಂತ ಕುಮಾರ್) దక్షిణ బెంగళూరు పార్ల మెంటరీ నియోజిక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరపున ప్రస్తుత 15వ లోక్ సభలో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు.[2]

అనంత్ కుమార్

Ananth Kumar addressing the Media in New Delhi on May 12, 2017


పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
5 జులై 2016
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ముప్పవరపు వెంకయ్య నాయుడు
తరువాత ఖాళీ

రసాయనిక, ఎరువుల శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 మే 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు శ్రీకాంత్ కుమార్ జెనా
తరువాత ఖాళీ

Member of the Indian Parliament
for బెంగళూరు దక్షిణ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1996
ముందు కె. వెంకటగిరి గౌడ

పౌర విమానయాన శాఖ
పదవీ కాలము
19 మార్చి 1998  13 అక్టోబరు 1999
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సి. ఎం. ఇబ్రహీమ్
తరువాత శరద్ యాదవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-07-22) 1959 జూలై 22
బెంగళూరు, మైసూరు రాష్ట్రం (ఇప్పుడు కర్ణాటక)
మరణం 2018 నవంబరు 12 (2018-11-12)(వయసు 59)[1]
బెంగళూరు, కర్ణాటక
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి తేజస్విని కుమార్
సంతానము 2 కూతుర్లు
పూర్వ విద్యార్థి కర్ణాటక విశ్వవిద్యాలయం
వెబ్‌సైటు ananth.org

బాల్యము

అనంత రమేష్ కుమార్ బెంగళూరులో 1959 జూలై 22 లో శ్రీ హెచ్.ఎన్.శాస్త్రి, శ్రీమతి గిరిజ దంపతులకు జన్మించారు.

విద్య

వీరు కె.ఎస్.ఆర్ట్స్ కళాశాల హుబ్లిలో బి.ఎ. ఎల్.ఎల్.బి చదివారు.

రాజకీయ ప్రస్థానము

అనంత కుమార్ 1988 నుండి 1995 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్య దర్శిగా ఉన్నారు. 1995 నుండి 1998 వరకు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్య దర్శిగా ఉన్నారు. 1996 లో 11 వ లోక్ సభకు ఎన్నికయి పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.. 1998 లో 12 వ లోక్ సభకు తిరిగి ఎన్నికయి కేంద్ర కాబినెట్ లో ప్రవేశించి విమాన యాన శాఖను నిర్వహించారు.ఆ తర్వాత పర్యాటక శాఖను, గ్రామీణాభివృద్ధి మంత్రిగాను పనిచేసారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. ఏబీవీపీలో జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులు చేపట్టి, 1996లో తొలిసారిగా ఎన్నికల్లో గెలిచాక, వెనుదిరిగి చూసుకోలేదు. దక్షిణ బెంగళూరు నుంచి ఆరోసారి ఎంపీగా గెలిచారు. ఈసారి ఐటీ దిగ్గజం నందన్ నిలేకని పై భారీ మెజారిటీతో గెలిచారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన అనంతకుమార్ ఒకప్పుడు అద్వానీకి అత్యంత సన్నిహిత అనుయాయిగా పేరొందారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో పలు శాఖలు చేపట్టారు. పార్టీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. కర్ణాటకలో పార్టీ వ్యవహారాల విషయంలో మాత్రం యడ్యూరప్ప తో విభేదాలున్నాయి.

ఇతర దేశాల పర్యటన

మూలాలు

  1. "Ananth Kumar: Union Minister Ananth Kumar passes away". K R Balasubramanyam. The Economic Times. 12 November 2018. Retrieved 12 November 2018.
  2. http://164.100.47.132/LssNew/Members/Statewiselist.aspx
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.