అధిక ఋతుస్రావం

ఋతుచక్రంలో ఎక్కువగా రక్తస్రావం (Bleeding) అవడాన్ని 'అధిక ఋతుస్రావం' (Menorrhagia) అంటారు. ఇవి 3-5 రోజులలోనే మామూలుగా కంటే ఎక్కువగా పోవచ్చు లేదా ఇంకా ఎక్కువ రోజులు జరగవచ్చును. దీనికి రక్తం గడ్డకట్టంలో దోషాలు, హార్మోనులకు సంబంధించిన పొరపాట్లు లేదా గర్భాశయంలోపలి పొరకు సంబంధించిన వ్యాధులు ముఖ్యమైన కారణాలు. కొందరిలో నొప్పి కూడా ఉండావచ్చు.

అధిక ఋతుస్రావం
Menorrhagia
ICD-10 N92.0
ICD-9 627.0
DiseasesDB 22575
eMedicine med/1449
MeSH D008595

కారణాలు

  • గర్బాశయంలో లేదా అండాశయంలో గడ్డలు :
  • కుటుంబ నియంత్రణ సాధనాలు : కొంతమందిలో ఐ.యు.సి.డి. గర్భాశయాన్ని అస్థిరంచేసి రక్తస్రావం జరిగేలా చేస్తాయి.
  • థైరాయిడ్ గ్రంధికి సంబంధించిన వ్యాధులు : థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేస్తున్నవారిలో కనిపిస్తుంది.
  • గర్భస్రావం : గర్భధారణ తరువాత అధిక రక్తస్రావం అవుతుంటే అబార్షన్ కి లేదా అబార్షన్ జరగబోతుందనడానికి సంకేతం. గర్భం కొనసాగడానికి లేదా గర్భాన్ని పూర్తిగా తొలగించడానికి తొందరగా చర్యలు తీసుకోవాలి.
  • గర్భాశయంలో తిత్తులు :
  • గర్భాశయంలో కాన్సర్ : బహిష్టులు ఆగిపోయిన కొంతకాలం తరువాత తిరిగి కనిపిస్తే దీని గురించి అనుమానించాలి.
  • కటివలయంలో వాపు : బహిష్టుస్రావం, కడుపునొప్పి, జ్వరంతో కలిసిన జననేంద్రియాలలో వాపును సూచిస్తుంది.
  • రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులు : కొంతమంది పక్షవాతం వచ్చినవారు రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులను వాడుతుంటారు. ఇందువలన స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

నష్టాలు

అధిక రక్తస్రావం ఎక్కడనుండి జరిగినా కొంతవరకు మన శరీరంలోని ఎముకమజ్జ నుండి కొత్తగా రక్తం ఉత్పత్తి అయి ఆలోటును భర్తీ చేస్తుంది. కానీ ఇది బాగా ఎక్కువగా గానీ లేదా ఎన్నో నెలలు వరుసగా జరిగినప్పుడు ఎముకమజ్జ ఆ లోటును పూడ్చలేకపోవడం వల్ల రక్తహీనత కలుగుతుంది. దీనిమూలంగా నీరసం, తలనొప్పి మొదలైన ఇబ్బందులు కలుగుతాయి.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.