అధికార భాష
ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, మన దేశానికి హిందీ అధికార భాష. మన రాష్ట్రానికి తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 19-3-1974 న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది. [1]
అధికార భాషా సంఘాలు
రాష్ట్రాలు-అధికార భాషలు
- అస్సాం - అస్సామీ, బోడో
- ఆంధ్ర ప్రదేశ్ - తెలుగు
- తెలంగాణ - తెలుగు, ఉర్దు
- తమిళనాడు - తమిళం
- పాండిచ్చేరి - తమిళం, మలయాళం
- పశ్చిమ బెంగాల్ - బెంగాలీ
- జమ్ము కాశ్మీర్ - కాశ్మీరీ, ఉర్దూ, డోంగ్రీ
- మేఘాలయ - ఖాసీ, గారో
- గుజరాత్ - గుజరాతీ
- దాద్రా నాగర్ హవేలీ - గుజరాతీ
- డామన్ డయ్యూ - గుజరాతీ
- కర్ణాటక - కన్నడ
- త్రిపుర - కొక్బొరోక్
- గోవా - కొంకణి
- మిజోరాం - మిజో
- మణిపూర్ - మణిపురి లేదా మీథేయ్
- కేరళ - మలయాళం
- లక్షద్వీప్ - మలయాళం
- బీహార్ - మైథిలి
- మహారాష్ట్ర - మరాఠీ
- సిక్కిం - నేపాలీ
- ఒడిషా - ఒరియా
- పంజాబ్ - పంజాబి
- చండీఘర్ - పంజాబి
- హర్యానా - పంజాబీ (రెండవ)
- ఢిల్లీ - ఉర్దూ, పంజాబీ (రెండవ)
- ఉత్తర ప్రదేశ్ - ఉర్దూ
మూలాలు
- గొడుగు నిర్మలాదేవి. అధికార భాష-తెలుగు చరిత్ర. Retrieved 2018-09-15.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.