అత్తాను రామానుజాచార్యులు

"'అత్తాను రామానుజాచార్యులు"' మహబూబ్ నగర్ జిల్లా లోని మునిపల్లె గ్రామానికి చెందిన వారు[1]... పాండురాజు వంశస్థుడు. మదనగోపాల భక్తుడు. ' రుక్మిణీ కల్యాణం ' ను కురవంజి రూపంలో రచించాడు. ఇందులో దవళాలు, సువ్వాలలు, మంగళహారతులు మొదలగు దేశి రచనలు ఉన్నాయని పరిశోధకులు తేల్చారు[2]. ఈ రుక్మిణి కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యాలయంలో ఉంది. రుక్మిణీ కురవంజిలో ఓ మచ్చుతునక....

కొట్నాలు దంచేటప్పుడు పాడే సువ్వాల

"వన్నె సన్న నూది పచ్చ గన్నెరాలు కృష్ణ భోగి

సన్న రాజనాలు జీల సర్లు దంపు చూ

ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార

గబ్బి గుబ్బ లదగాను కలయదంచిరీ

మూలాలు

  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-39
  2. మరుగునపడిన మాణిక్యాలు, రచన: బిరుదురాజు రామరాజు, పుట-65
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.