అంబటివానిపేట

అంబటివానిపేట , శ్రీకాకుళం జిల్లా, గార మండలానికి చెందిన గ్రామము .[1]

అంబటివానిపేట
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం గార
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 532404
ఎస్.టి.డి కోడ్

ఈ ఊరు శ్రీకాకుళం టౌన్ నుండి 7 కి.మి. దూరంలో ఉంది. రామచంద్రాపురం పంచాయితీ పరిధిలోనికి వస్తుంది. అంబటివానిపేట, రామచంద్రాపురం, శిమ్మపేట, జొన్నలపాడు గ్రామాలు ఇదే పంచాయితీకి చెందినవి. దీని సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు :శ్రీకూర్మం, అరసవల్లి

వ్యవసాయం, నీటివనరులు

అంబటివానిపేట వూర్లో కల చెరువులు, గెడ్డలు.

ఆలయాలు

అంబటివానిపేట ఊర్లో గౌరీ అమ్మవారి గుడి, రామ మందిరం మరియు శివుని గుడి ఉన్నాయి.

సమీప పుణ్యక్షేత్రాలు

విశేషాలు

అంబటివానిపేట "పాతూరు"

"పాతూరు" చిత్రంలో చాలా దూరంగా కనిపిస్తున్న దుబ్బ ఒకప్పుడు ఊరు. సుమారు నలభై సంవత్సరాల క్రితం ఊరు ప్రస్తుతం ఉన్న చోటికి మారింది. కారణం అది లోతట్టు ప్రాంతంలో ఉండేది. పాత ఊరిని పొలాలుగా మార్చారు.

చిత్రమాలిక

ఊరిలో ఆవుల కాపరులు ఊర్లో అందరి దగ్గర బియ్యం, కూరగాయలు దండి ఊరచెరువు దగ్గర మర్రి చెట్టు కింద సంక్రాంతి రోజు ఆవులను పూజిస్తారు. అందరు కలసి భోజనాలు చేస్తారు.

చనిపోయిన పెద్దలకు సంక్రాంతి రోజు భక్తితో ఇలా అన్ని వంటకాలు కలిపి పెడతారు. ఆ రోజు రాత్రి గొబ్బెమ్మలు ఇంటి ముందు పెడతారు.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.