అంతం (సినిమా)

అంతం 1992 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో నాగార్జున, ఊర్మిళ ప్రధాన పాత్రలు పోషించారు. శివ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన రెండో సినిమా ఇది.[1] ఇందులో పాటలు జనాన్ని ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇదే సినిమాను హిందీలో నాగార్జునతోనే ద్రోహి గా రూపొందించారు.[1]

తెలుగు సినిమా*వేదిక
అంతం
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
నిర్మాతకె. ప్రసాద్ (నిర్మాత), బోనీ కపూర్ (సమర్పణ)
నటులునాగార్జున, ఊర్మిళ
సంగీతంకె.వి.మహదేవన్
ఛాయాగ్రహణంతేజ
నిర్మాణ సంస్థ
దృశ్య క్రియేషన్స్
విడుదల
సెప్టెంబరు 11, 1992 (1992-09-11)
భాషతెలుగు

తారాగణం

  • నాగార్జున
  • ఊర్మిళ
  • డానీ
  • సలీం గౌస్
  • ఆకాశ్ ఖురానా
  • డబ్బింగ్ జానకి
  • రాళ్ళపల్లి
  • గోకిన రామారావు
  • సిల్క్ స్మిత

చిత్రీకరణ

ఈ సినిమాలో కొంతభారం శ్రీలంక లో చిత్రీకరించబడింది.[1]

పాటలు

ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి. చలెక్కి ఉందనుకో అనే పాటను మణిశర్మ రూపొందించగా, గుండెల్లో దడ దడ అనే పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చాడు. మిగతా నాలుగు పాటలు ఆర్. డి. బర్మన్ స్వరపరిచాడు. అన్ని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశాడు. నేపథ్య సంగీతం మణిశర్మ అందించాడు. మణిశర్మకు టైటిల్ కార్డు పడ్డ తొలిచిత్రం కూడా ఇదే.[1]

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.