అంజలీదేవి

అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 - జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.[1][2]. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము[3], 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది[4].

అంజలీదేవి

జన్మ నామంఅంజనీ కుమారి
జననం (1927-08-24) 1927 ఆగస్టు 24 ఆగష్టు 24, 1927
పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా
మరణం2014 జనవరి 13 (2014-01-13)(వయసు 86)
చెన్నై, తమిళనాడు
భార్య/భర్తపి.ఆదినారాయణరావు
ప్రముఖ పాత్రలులవకుశ
చెంచులక్ష్మి
శ్రీ లక్ష్మమ్మ కథ
అంజలీదేవి చిత్రపటం

బాల్యం

అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది [5]. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.[6]

చిత్ర సమాహారం

నటిగా

1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.[7] సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993) మరియు పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

నిర్మాతగా

అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

కుటుంబం

ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు. ఆమెకు ఇద్దరు కుమారులు.

కొన్ని ముఖ్యమైన చిత్రాలు

సంవత్సరంసినిమా పేరుభాషపోషించిన పాత్రవిశేషాలు
1936రాజా హరిశ్చంద్రతెలుగులోహితాస్యుడుఅంజలీదేవి నటించిన మొదటి సినిమా
1949కీలుగుర్రంతెలుగుమోహిని (రాక్షసి)అక్కినేని మొదటి సినిమా.
1950శ్రీ లక్ష్మమ్మ కథతెలుగులక్ష్మమ్మ
1950పల్లెటూరి పిల్లతెలుగుశాంతఅక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా
1953పక్కయింటి అమ్మాయితెలుగులీలాదేవి, పక్కింటమ్మాయిరేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం.
1954పెన్తమిళం
1955అనార్కలితెలుగుఅనార్కలి
1957సువర్ణ సుందరితెలుగుదేవకన్య సువర్ణసుందరి
1958చెంచులక్ష్మితెలుగుచెంచులక్ష్మి/లక్ష్మీదేవి
1959జయభేరితెలుగుమంజువాణిమంచి సంగీతభరిత చిత్రం.
1962భీష్మతెలుగుఅంబఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ.
1963లవకుశతెలుగుసీతాదేవిఘనవిజయం సాధించిన చిత్రం.
1967భక్త ప్రహ్లాదతెలుగులీలావతిరోజారమణి ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం
1972బడిపంతులుతెలుగుఎన్టీయార్ భార్యఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం
1973తాతా మనవడుతెలుగుసీత, రంగయ్య భార్యదాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం.
1975సోగ్గాడుతెలుగుశోభన్‌బాబు తల్లి
1976మహాకవి క్షేత్రయ్యతెలుగు
1978అన్నాదమ్ముల సవాల్తెలుగుఅన్నదమ్ముల తల్లికృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా.
1980చండీప్రియతెలుగుశోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం.
1985శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యంతెలుగుబాయీజా బాయ్విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర.
1992బృందావనంతెలుగురాజేంద్రప్రసాద్ తల్లిమంచి కుటుంబ కథాచిత్రం

పురస్కారాలు

ఫిలింఫేర్ అవార్డ్

మరణం

అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు[8].

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.