విజయచిత్ర
తెలుగు పత్రికారంగంలో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర అనే సినిమా మాసపత్రిక 1966 సంవత్సరంలో విడుదలైనది. దీనికి రావి కొండలరావు సారధ్యం వహించారు. ఇది చందమామ పత్రికను ప్రచురించే డాల్టన్ పబ్లికేషన్స్ వారిది. ఇది సుమారు 40-50 సంవత్సరాలు నడిచింది.
ఇది తెలుగులో సినిమా ప్రారంభోత్సవాలు, షూటింగ్ విశేషాల వంటి సాధారణ విషయాలతో పాటు ప్రముఖ దర్శకుల, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సినిమాల వివరాలు, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు మొదలైన వాటిని గురించి విజ్ఞానభరిత సమాచారం అందిస్తుండేది. కొన్ని ఉత్తమమైన పాత సినిమా కథను వివరంగా మాటలతో సహా అంచెలంచెలుగా ప్రచురించేవారు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.