ప్రభ (నటి)
ప్రభ (కోటి సూర్య ప్రభ) తెలుగు సినీ నటీ, ప్రముఖ నర్తకి.
సినీరంగ ప్రస్థానం
ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది[1]. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].
చిత్ర సమాహారం
- ఆడదంటే అలుసా
- ఆమెకథ
- ఆత్మ బంధువులు
- అక్కమొగుడు చెల్లెలి కాపురం
- అత్తవారిల్లు
- చిలిపి కృష్ణుడు
- దేవతలారా దీవించండి
- ధర్మం దారి తప్పితే
- గంధర్వ కన్య (1979 సినిమా)
- గీత సంగీత
- ఇదెక్కడి న్యాయం
- ఇల్లాలి ముచ్చట్లు
- ఇల్లంతా సందడి
- ఇంటింటి రామాయణం
- కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
- కోరికలే గుర్రాలైతే
- సీతాపతి సంసారం
- స్నేహమేరా జీవితం
- మహాకవి క్షేత్రయ్య
- నీడలేని ఆడది
- నేను – మా ఆవిడ
- ఒకే రక్తం
- జగన్మోహిని
- జీవితమే ఒక నాటకం
- రాధమ్మ మొగుడు
- రగిలేగుండెలు
- రాముడు-రంగడు
- మాయాబజార్ (1995 సినిమా)
- పెళ్ళిళ్ళ పేరయ్య
- ప్రచండ భారవి
- పార్వతీ పరమేశ్వరులు
- పగబట్టిన సింహం
- పెద్దిల్లు చిన్నిల్లు
- దాన వీర శూర కర్ణ
- స్వర్గానికి నిచ్చెనలు
- స్వర్గసీమ
- తల్లే చల్లని దైవం
- వందేమాతరం (1982 సినిమా)
- మన ఊరి మారుతి
- మంచి మనసు
- మరో సీత కథ
- వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
- గంధర్వ కన్య
అవార్డులు
- నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు - వేగుచుక్కలు (2003)
మూలాలు
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రభ పేజీ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.