నిన్నే ఇష్టపడ్డాను

నిన్నే ఇష్టపడ్డాను 2003 లో కొండా దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో తరుణ్, శ్రీదేవి, అనిత ముఖ్యపాత్రల్లో నటించారు.

నిన్నే ఇష్టపడ్డాను
నటులుతరుణ్,
శ్రీదేవి,
అనిత
సంగీతంఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
నిర్మాణ సంస్థ
దుర్గా ఆర్ట్స్
విడుదల
2003
భాషతెలుగు

కథ

విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు. హైదరాబాదు నుంచి వచ్చి విశాఖపట్నంలో అదే కళాశాలలో చదువుతున్న సంజన అనే అమ్మాయి మరియు చరణ్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు శృతి మించడంతో సర్దుబాటు చేసుకుంటారు. సంజన చరణ్ ని ప్రేమించానని చెబుతుంది. చరణ్ కూడా ఆమెను మనసారా ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు సంజన చెప్పకుండా హైదరాబాదు వెళ్ళిపోతుంది.

తారాగణం

  • చరణ్ గా తరుణ్
  • శ్రీదేవి
  • అనిత
  • బోనీ గా రాజీవ్ కనకాల
  • ఆలీ
  • శరత్ బాబు
  • గిరిబాబు
  • సుదీప
  • బ్రహ్మానందం
  • ఎం. ఎస్. నారాయణ
  • రావి కొండలరావు
  • ఝాన్సీ
  • నేహా ధుపియా -అతిథి పాత్ర, ఐటం సాంగ్‌లో నటించింది.

మూలాలు

  1. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". Review. G. V. Ramana. 12 June 2003. Retrieved 12 March 2018.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.